ప్రధాన వార్తలు

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌..

Tirumala | శ్రీవారి భక్తులకు తిరుమ‌ల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.Tirumala | శ్రీవారి భక్తులకు తిరుమ‌ల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ డిప్ కింద కేటాయించే టికెట్ల కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. టికెట్లు పొందిన భక్తులు 21 నుంచి 23న మధ్యాహ్నం 12గంటల లోపు డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని దేవస్థానం బోర్డు చెప్పింది.22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్సవాల‌ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. అదే రోజున మధ్యాహ్నం 22 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు రిలీజ్‌ చేయనున్నట్లు వివరించింది.ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవారి సేవ(తిరుమల-తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులందరూ ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరింది. ..

రూ.300కోట్ల స్థలం కబ్జా వ్యవహారం నిందితులపై కేసు..

నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి.నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు‘నమస్తే’ కథనాలతో స్పందించిన అధికారులుతహసీల్దార్‌ ఫిర్యాదుతో ఆర్గనైజ్డ్‌ క్రైం కింద కేసుబంజారాహిల్స్‌,మే 18: నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్‌ 403/పీ లోకి వచ్చే టీఎస్‌ నెంబర్‌ 1/పి, బ్లాక్‌-హెచ్‌, వార్డు-10లో 5 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు బోగస్‌ పత్రాలను తయారు చేసిన పరుశరామ్‌ పార్థసారథి, అతడి కొడుకు విజయ్‌భార్గవ్‌ తదితరులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్థసారథి మీద గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు క్రిమినల్‌ కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చాడు.కాగా ఫిబ్రవరిలో సైతం అతడి అనుచరులు సంబంధిత స్థలం లోపలికి ప్రవేశించి గది నిర్మించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగడంతో మరో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.హెచ్చరిక బోర్డుల తొలగింపు..కాగా ఇటీవల మరోసారి పార్థసారథితో పాటు అతడి అనుచరులు 5ఎకరాల స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడం, లోపలివైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు వ్యక్తులు నిఘా పెట్టిన వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలపై షేక్‌పేట్‌ మండల తహసీల్దార్‌ అనితారెడ్డి స్పందించారు. ఈనెల 16న రెవెన్యూ సిబ్బంది స్థలం వద్దు చేరుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను తొలగించారు. రెవెన్యూ సిబ్బంది వెళ్లిపోగానే అదేరోజు రాత్రి మరోసారి బోర్డును తుడిచివేశారు. దీంతో శనివారం మరోసారి అక్కడకు చేరుకున్న రెవెన్యూ సిబ్బంది బోర్డులను రాయించడంతో పాటు గేటును సీజ్‌ చేసి తాళాలు వేశారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు..కాగా ఎన్నిసార్లు హెచ్చరించినా పార్థసారథి, విజయ్‌తో పాటు వారి అనుచరులు పద్ధతి మార్చుకోకపోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. సుమారు రూ.300కోట్ల విలువైన స్థలాన్ని తమ స్థలంగా చూపిస్తూ జనాన్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పార్థసారథి, విజయ్‌తో పాటు స్థలంలోకి ప్రవేశిస్తున్న అనుచరులపై బీఎన్‌ఎస్‌ 329(3), 111(4), 221,352, 322, 324(2), 62 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రభుత్వస్థలాన్నికాజేసేందుకు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న నిందితులపై ఆర్గనైజ్డ్‌ క్రైంగా బీఎన్‌ఎస్‌ 111(4) సెక్షన్‌ నమోదు చేయడం విశేషం. ..

Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్‌ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది.అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్‌ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి బయటపడినట్లు పేర్కొంది. ఈ క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. దీనికి సంబంధించి చికిత్స అందించే విషయమై ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.బైడెన్‌ అనారోగ్యంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) స్పందించారు. బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు తెలిసి తాను, మెలానియా చాలా బాధపడ్డామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బైడెన్‌ కుటుంబానికి తాము అండగా ఉంటామని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బైడెన్‌ పోరాట యోధుడని, క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.జో బైడెన్‌ 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌తో జరిగిన చర్చలో విఫలమవడంతో పోటీనుంచి తప్పుకున్నారు. దీంతో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఎన్నికల బరిలో నిచారు. అయితే నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. ..

ప్రాసెస్డ్‌ పదార్థాలు వద్దు

కాలం మారిపోయింది. జీవితాల్లో వేగం పెరిగింది. ఒకప్పటి పెద్దలతో పోలిస్తే ఇప్పటి తరం పిల్లలైనా, పెద్దలైనా ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారనే చెప్పాలి. అయితే, ప్రాసెస్డ్‌ పదార్థాలను తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇంటి దగ్గర వండుకోవడం, ముతక ధాన్యాలను ఎంచుకోవడం లాంటి మార్పులతో తాజాగా, పోషకాలతో సమృద్ధమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.ఇంటివంటముతక ధాన్యాలతో ఇంటి దగ్గరే ఆహారం వండుకోవాలి. దీంతో ప్యాకేజ్డ్‌ ఆహారాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఉండే ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమమైన రుచి కారకాలు, అధిక సోడియం ముప్పును తప్పించుకోవచ్చు.ఏం వాడారో చదవండిమార్కెట్లలో మీరు కొనే ఆహార పదార్థాల ప్యాక్‌లపై రాసి ఉండే వివరాలను చదవండి. యాడిటివ్స్‌, కృత్రిమ తీపి పదార్థాలు, మనం గుర్తించలేని రసాయనాలు ఏమైనా ఉన్నాయో చూడండి. ఒకవేళ ప్యాకేజ్డ్‌ ఆహారం తప్పదనుకుంటే సహజమైన పదార్థాలను వాడిన, తక్కువ ప్రాసెస్‌ చేసిన వాటినే ఎంచుకోండి.ఫ్లేవర్డ్‌ జ్యూస్‌లు వద్దుసోడా, ఫ్లేవర్డ్‌ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌కు సాధ్యమైనంత వరకు దూరం ఉండాలి. నీళ్లు, హెర్బల్‌ టీలు, ఇంట్లో తయారుచేసుకున్న స్మూతీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.ముతక ధాన్యాలుబాగా మరపట్టిన బియ్యం, రిఫైన్డ్‌ పాస్తా, ప్రాసెస్డ్‌ ధాన్యాల కంటే బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, హోల్‌ వీట్‌ బ్రెడ్‌, ఓట్స్‌కు వంటలో పెద్దపీట వేయాలి. వీటితో మనకు ఎక్కువ ఫైబర్‌, మరిన్ని పోషకాలు అందుతాయి.ప్యాకేజ్డ్‌ చిరుతిండ్లు వద్దుచిప్స్‌, క్యాండీలు, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ స్థానంలో తాజా పండ్లు, గింజలు, యోగర్ట్‌కు చోటివ్వాలి. ఇలా చేస్తే కృత్రిమ ఫ్లేవర్లు, అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక ప్రిజర్వేటివ్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.ముందే వండుకోవాలిచాలామంది పనుల హడావుడిలో పడి చివరి నిమిషం వరకు ఆగి, తర్వాత ప్రాసెస్డ్‌ ఆహారం తింటూ ఉంటారు. దీనికంటే ముందుగానే ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధంగా ఉంచుకోవాలి.మార్కెట్‌ చుట్టేయాలివస్తువులు కొనేటప్పుడు మార్కెట్‌ మొత్తం తిరగండి. పండ్లు, కూరగాయలు సహా ఆహార పదార్థాలు ఏవైనా సరే ఎక్కువగా ప్రాసెస్‌ చేయనివే కొనండి.సాస్‌లు సొంతంగాముందే ప్యాకై వచ్చిన సాస్‌లను పక్కనపెట్టండి. ఇంటి దగ్గరే తాజాగా ఉండే మూలికలు, మసాలా దినుసులతో సాస్‌లు చేసుకోండి.తక్కువగా డబ్బా ఆహారంఅదనపు ప్రిజర్వేటివ్స్‌, అధిక సోడియం, కృత్రిమ యాడిటివ్స్‌, అనారోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్‌ లేని తాజా, శీతలీకరించిన పండ్లు, కూరగాయలు ఎంచుకోవాలి.శ్రద్ధగా తినాలితినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎంచుకుంటాం. ..

ఆటుపోట్లకు ఆస్కారం..నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 1,011.80 పాయింట్లు లేదా 4.21 శాతం ఎగిసి 25,019.80 దగ్గర ముగిసింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. దేశ, విదేశీ పరిణామాలు మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత వారం స్టాక్‌ మార్కెట్లు పడుతూ..లేస్తూ.. కొనసాగాయి.దేశీయ స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. దేశ, విదేశీ పరిణామాలు మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత వారం స్టాక్‌ మార్కెట్లు పడుతూ..లేస్తూ.. కొనసాగాయి. అయినప్పటికీ అంతిమంగా లాభాలనే అందుకోగలిగాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 2,876.12 పాయింట్లు లేదా 3.61 శాతం ఎగబాకి 82,330.59 వద్ద స్థిరపడింది.నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 1,011.80 పాయింట్లు లేదా 4.21 శాతం ఎగిసి 25,019.80 దగ్గర ముగిసింది. దీంతో ఈ వారం కూడా సూచీలు ఆటుపోట్లకు లోనుకావచ్చన్న అంచనాలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు దేశ జీడీపీ గణాంకాలు విడుదల కావాల్సి ఉన్నది. ఇవి కూడా ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. భారత్‌-పాకిస్థాన్‌ వ్యవహారాలు, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి అంశాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ సైతం కీలకం కానున్నాయి.అలాగే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,400 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,400-25,700 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.గమనిక..స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్‌ పల్స్‌. ..